Site icon

కొండాసురేఖ‌పై కేటీఆర్ ప‌రువున‌ష్టం దావా

ఇటీవ‌ల స‌మంత‌, నాగ చైత‌న్య విడాకుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కొండా సురేఖ‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ మేర‌కు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ ప్రారంభమైంది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు ఇందుకు సంబంధించిన పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అక్కినేని కుటుంబ‌స‌భ్యుల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై న్యాయ‌స్థానం ఇవాళ‌ రెండో సాక్షి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేయ‌నుంది. ఇటీవ‌ల నాగార్జున‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కోర్టుకు హాజ‌ర‌వ‌గా కోర్టు వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

Share
Exit mobile version