Site icon

తెలంగాణలో మ‌ళ్లీ ఎమ‌ర్జెన్సీ రోజులొచ్చాయి

తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పాల‌న‌తో తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎమ‌ర్జెన్సీ రోజులొచ్చాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్య‌వ‌స్థ‌పై, ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయాని విమ‌ర్శించారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ పాత కాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయ‌న్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నార‌ని, హక్కులను అడిగితే బెదిరిస్తున్నార‌ని, పోరాడితే సస్పెన్షన్లు చేస్తున్నార‌ని, నియంతృత్వ రాజ్యంగా మార్చి, ప్ర‌భుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తోంద‌ని ఆరోపించారు. తెలంగాణ‌కు పోరాటం కొత్తకాద‌ని, ఈ మట్టి పొత్తిళ్ల‌లోనే పోరాటం ఉంద‌న్నారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామ‌ని, ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణ కోసం పోరాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Share
Exit mobile version