బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇరు పార్టీల మద్య క్విడ్ ప్రోకో ఏంటంటూ ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటిపై జరిగిన ఈడీ దాడులను కేటీఆర్ ప్రస్తావించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిపి నెల రోజులు కావస్తున్నా ఈడీ అధికారులు ఒక్క విషయం కూడా బయట పెట్టలేదన్నారు. పొంగులేటి ఇంట్లో డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు ముగిసిన వెంటనే ఆయన హైదరాబాద్‌లో అదానీతో రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించారు. ఇక్కడ క్విడ్ ప్రోకో ఏంటని, ఎవరైనా అంచనా వేయగలరా అంటూ ప్రశ్నించారు.