Site icon

పెన్ష‌న్ల కోసం రోడ్డెక్కుతార‌ని ఎవ‌ర‌నుకున్న‌రు?

తెలంగాణ‌లో పెన్ష‌న్ల కోసం వృద్ధులు రోడ్డు ఎక్కుతార‌ని ఎవ‌ర‌నుకున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో పెన్ష‌న్ల ప‌రిస్థితిపై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు. ఇట్లా అవునని ఎవరనుకున్నారు? తెలంగాణాలో ఫించన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు? టంచన్ గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు? మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి… కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు? మందుబిల్లల కోసం కొడుకులు , కోడళ్ళ దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే ‘మార్పు’ వస్తుందని ఎవరనుకున్నారు? అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు? మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు? అని కేటీఆర్ పోస్టు చేశారు.

Share
Exit mobile version