Site icon

ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందున‌ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. పోలీసులు ఆయ‌న‌ను విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. అయితే ఆయ‌న విచార‌ణ‌కు రాలేనంటూ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. నేడు ఆయ‌న మ‌ద్దిపాడు పోలీస్ స్టేష‌న్‌లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. ఆయ‌న హాజ‌రు కార‌న్న స‌మాచారంతో మ‌ద్దిపాడు పోలీసులు ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. ఆర్జీవీ ఇంటి బ‌య‌ట పోలీసులు వేచి ఉన్నారు. ఆయ‌నను అరెస్టు చేసి మ‌ద్దిపాడు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు.

Share
Exit mobile version