Site icon

అంద‌ని ప‌రిహారం… ఆగిన గుండె..

పోర్టుకు భూమి కావాల‌ని ప్ర‌భుత్వం అడిగితే జీవ‌నాధార‌మైన భూమిని అప్ప‌జెప్పాడు.. స‌ర్కార్ నుంచి రావాల్సిన ప‌రిహారం అంద‌క‌పోవ‌డంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద‌ర‌క సంఘ‌ట‌న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. చేవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్ రామాయపట్నం పోర్టుకు భూమి ఇచ్చాడు. ప్ర‌భుత్వం నుంచి న‌ష్ట‌ప‌రిహారం రావాల్సి ఉంది. భూమి ఇచ్చి రెండేళ్లు అవుతున్నా ప‌రిహారం అంద‌లేద‌ని వినోద్ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. దీంతో శుక్ర‌వారం కావ‌లిలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న‌ ఆత్మహత్యకు పోర్టు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతియే కారణమని బాధితుడు వీడియోలో ఆరోపించాడు. మృతదేహాన్ని వినోద్ స్వ‌గ్రామ‌మైన‌ చేవూరుకు తరలించారు.

Share
Exit mobile version