మ‌హిళ‌ను 25 ముక్క‌లు చేసి దారుణ హ‌త్య‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో మ‌హిళ మిస్సింగ్ ఘ‌ట‌న విషాదాంత‌మైంది. ఉద్యోగం వ‌స్తుంద‌ని త‌నను న‌మ్మి వ‌చ్చిన ఓ మ‌హిళ‌ను ఓ వ్య‌క్తి 25 ముక్క‌లు చేసి దారుణంగా హ‌త‌మార్చాడు. జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతుల వద్ద వీరభద్రం, స్వాతి ఇద్దరు వ్య‌క్తులు రూ.16 లక్షలు తీసుకొని సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగం రాకపోవడంతో నెల నెల వడ్డీ పెరుగుతూ వచ్చింది. దీంతో రత్నకుమార్, పార్వతి ఆత్మహత్యయత్నం చేయ‌గా స్వాతి వారికి రూ.16 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల స్వాతి వీర‌భ‌ద్రానికి ఆ డబ్బులు ఇచ్చి పంపింది. డబ్బును చూసిన వీరభద్రం ఆ సొమ్మును ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. స్వాతికి డబ్బులు ఇవ్వకుండా ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా హత మార్చాడు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా 25 ముక్కలు చేశాడు. ఆ ముక్క‌ల‌ను ఒక మూటలో వేసి పక్కనే వున్న పొలంలో పడేసి వెళ్లిపోయాడు. స్వాతి వ్య‌వ‌హారంపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్ర‌మంలో ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది.పంట పొలాల వద్దకు వెళ్లిన పోలీసులు ఒక మూటలో ముక్కలుగా ఉన్న మహిళ మృత దేహాన్ని గుర్తించారు.ఆ మూటను ఆసుపత్రికి తరలించి పరిశీలించగా మృతదేహం స్వాతిద‌ని గుర్తించారు. దీంతో వీరభద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *