మీడియాకు సారీ చెప్పిన మంచు మ‌నోజ్‌!

న‌టుడు మోహ‌న్ బాబు మీడియాపై దాడి చేయ‌డంపై ఆయ‌న కుమారుడు, న‌టుడు మంచు మ‌నోజ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల‌తో మంచు కుటుంబం గురించి తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో మోహ‌న్ బాబును మీడియా ప్ర‌శ్నించ‌గా ఆయ‌న దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీనిపై మ‌నోజ్ మాట్లాడుతూ… మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాన్న మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింద‌న్నారు. నాన్న అంటే త‌న‌కు ప్రాణం అని, నాన్న దేవుడి లాంటి వ్య‌క్తి చెప్పారు. త‌న తండ్రిని త‌న‌ అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశార‌ని ఆరోపించారు. నాన్న దృష్టిలో త‌న‌ను శత్రువుగా చిత్రీకరించార‌ని చెప్పాడు. మ‌నోజ్ త‌న భార్య‌తో కలిసి ఓ టాయ్స్ కంపెనీ పెడితే దానికి కూడా అడ్డంకులు సృష్టించార‌న్నారు. త‌న‌పై దాడులు చేశార‌ని, త‌న తండ్రి ముందే త‌న‌ను కొట్టార‌ని వెల్ల‌డించారు. త‌న‌కు అండ‌గా ఉంటున్న త‌న త‌ల్లిని కూడా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని చెప్పారు. త‌న‌ భార్య, త‌న‌ ఏడు నెలల కూతురి పేర్లు లాగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌ సొంత కాళ్ల మీద నిలబడుతున్నాన‌ని, ఎవరిని ఆస్తి అడగలేద‌ని స్ప‌ష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *