మంగ‌ళ‌గిరిలో ‘మ‌న ఇల్లు – మ‌న లోకేశ్‌’

కూటమి ప్రభుత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో ‘మన ఇల్లు-మన లోకేశ్‌’ కార్యక్రమానికి మంత్రి నేడు శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా గోవిందు, సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నెర‌వేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. .. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇవ్వాలని కోరారు. మొదటి విడతగా మూడు వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. స్వచ్ఛ మంగళగిరి పేరుతో దేశంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తయారు చేయాలని పని చేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలో అత్యంత ఆధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామ‌న్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *