Site icon

అమెరికాకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్

విదేశీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. నేడు ఆయ‌న శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అక్క‌డి విమానాశ్రయంలో తెలుగు వాళ్లు, టీడీపీ ఎన్నారై కార్య‌క‌ర్త‌లు మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు ఆత్మీయంగా పలకరించార‌ని, ఈ నెల 29న లాస్ వేగాస్ లో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాన‌న్నారు. టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం నేటి నుంచి ప్రారంభం అయినందును లోకేశ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కీల‌క సూచ‌న‌లు అంద‌జేశారు. ప్రతి ఒక్కరూ రూ.100తో టీడీపీ సభ్యత్వం తీసుకోవాల‌న్నారు. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుంద‌ని వెల్ల‌డించారు.

Share
Exit mobile version