Site icon

డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్‌

మంత్రి నారా లోకేశ్ డీఎస్సీపై నేడు కీల‌క ప్ర‌క‌టన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారని, ఉపాధ్యాయులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి చెప్పారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌, ఉద్యోగాల భ‌ర్తీలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ‘ఎన్నికలకు రెండు నెలల ముందు గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింద‌న్నారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు జ‌ర‌గ‌లేద‌ని, డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేద‌ని వెల్ల‌డించారు. ఉపాధ్యాయులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామ‌న్నారు.మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌మ‌ని, అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్న‌మ‌ని చెప్పారు.

Share
Exit mobile version