Site icon

జ‌నావాసాల్లో బాంబుల దుకాణాలుంటే అధికారుల‌దే బాధ్య‌త‌

జ‌నావాసాల్లో బాంబుల దుకాణాలు ఉంటే అధికారుల‌దే బాధ్య‌త అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… జ‌నావాసాల్లో బాంబుల దుకాణాలు లేకుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ‌ల్లీల్లో బాంబుల విక్ర‌యం చేప‌ట్టొద‌న్నారు. అధికారులు ఎక్క‌డిక్క‌డ త‌నిఖీలు చేప‌ట్టి గ‌ల్లీల్లోని దుకాణాల్లో అమ్మ‌కాల‌ను అడ్డుకోవాల‌న్నారు. వ్యాపార‌స్తులు క్రీడా మైదానాలు, స్కూల్‌ గ్రౌండ్లను బాంబుల విక్ర‌యానికి వాడుకోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి న‌గ‌రంలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు ప్ర‌మాదాల‌ను ప్ర‌స్తావించారు. అబిడ్స్‌తో పాటు యాకత్ పురాలోని చంద్రనగర్‌లో బాంబుల దుకాణాల వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయ‌ని, అదృష్టవశాత్తు పెద్దగా న‌ష్టం జరగలేదన్నారు. జ‌నావాసాల్లో ఎవ‌రైనా బాంబులు విక్ర‌యిస్తే స్థానికులు అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

Share
Exit mobile version