బీఆర్ఎస్ నేతలు ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలో అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పాలనలో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికలప్పుడు ఆటో కార్మికులకు రూ.12 వేలు ఆర్థిక సహాయం ఇచ్చే హామీ ఇచ్చినప్పటికీ, ఈ ఏడాది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోయామన్నారు.