కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభం కాకుండానే ముగిసింది. సమావేశానికి హాజరైన కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆందోళనకు దిగారు. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా కిందనే సీటు వేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక పక్కనే నిలబడి మైక్ తీసుకొని మాట్లాడారు. మేయర్ సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేషన్ నిధులను ఆయన సొంతానికి వాడుకున్నారన్నారు. విచారణకు ఎదుర్కునేందుకు సురేశ్ బాబు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడవద్దని కౌన్సిల్ సభ్యులు ఆందోళన చేపట్టారు. కొందరు కార్పొరేటర్లతో పాటు మేయర్ సురేష్ బాబు అసహనంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.