Site icon

అట్ట‌డుగు వ‌ర్గాల‌పై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం

రాష్ట్రంలో అట్ట‌డుగు వ‌ర్గాల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. బొత్స స‌త్య నారాయ‌ణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో వైయ‌స్ జ‌గ‌న్ అన్ని కులాల‌ను గౌర‌వించి, అంద‌రికీ స‌మాన స్థాయిలో ప‌ద‌వులు ఇచ్చార‌ని గుర్తు చేశారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం అట్ట‌డుగు వ‌ర్గాల‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. సూపర్ సిక్స్ కు నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వానికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్న‌ చిత్తశుద్ది లేద‌న్నారు.

Share
Exit mobile version