Site icon

ప‌త్తి కొనుగోళ్ల జాప్యంపై ఎంపీ విజ‌య సాయిరెడ్డి ఫైర్‌

ఏపీలో ప‌త్తి కొనుగోళ్ల‌లో జాప్యంపై ఎంపీ విజ‌య సాయిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొనుగోళ్లు ఆల‌స్యం కావ‌డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. ఏపీలో పత్తి ఆలస్యమైన ప‌త్తి సేకరణ, తగ్గిన ధరలతో రైతులు ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 31 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలలో 20 మాత్రమే పని చేస్తున్నాయ‌ని తెలిపారు. జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కొనుగోళ్లలో పత్తి తేమ శాతంపై ఉదాసీనత చూపాలని సీసీఐని కోరాలని కోరారు.

Share
Exit mobile version