ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు నామినేషన్ వేయాల్సిందిగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాగబాబుకు సమాచారం అందించారు. అలాగే నామినేషన్ కోసం కావాల్సిన పత్రాలను తయారు చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి నాగబాబును ఎంపిక చేశారు. సినీరంగంతో మంచి సంబంధాలున్న నాగబాబుకు సినిమాటొగ్రఫీ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.