హర్యానాలో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ షైనీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. కాగా, బీజేపీ వరుసగా మూడోసారి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం.