Site icon

మ‌హారాష్ట్ర పీసీసీ చీఫ్ రాజీనామా

మ‌హారాష్ట్ర కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ కూట‌మి మ‌హాయ‌తి ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచింది. దీంతో కాంగ్రెస్‌ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ నానా ప‌టోలే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Share
Exit mobile version