జమ్మూకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల్లో ఎన్సీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగానే ఉంది. ఈ రెండు పార్టీలు మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయగా 48 స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో 42 ఎన్సీ గెలుపొందగా కాంగ్రెస్ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 46 స్థానాలు అవసరం ఉండగా ఎన్సీకి స్వతంత్య్ర అభ్యర్థులు, ఆప్ ఎమ్మెల్యే మద్దతిచ్చారు. దీంతో కాంగ్రెస్ మద్దతు లేకుండానే ఎన్సీ ప్రభుత్వాన్ని స్థాపించింది.