తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీలుగా గెలుపొందిన బీజేపీకి చెందిన బీజేపీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎం. లక్ష్మణ్, రఘునందన్ రావులు హాజరయ్యారు. ఇక మరోవైపు, ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలు శాసన మండలికి నూతనంగా ఎన్నికయ్యారు. వీరికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు ధానికోట శ్రీధర్ బాబు, నక్కా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.