నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్ జగన్ వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్ 11న రైతు సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. అలాగే డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళనలు నిర్వహించనున్నారు. కరెంట్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఈ,సీఎండీ ఆఫీసులకు ర్యాలీ నిర్వహించనున్నారు. జనవరి 3న ఫీ రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు.