ఇటీవల సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ప్రత్యక్షమైన అఘోరీ నాగసాధును పోలీసులు అరెస్ట్ చేశారు. ముత్యాలమ్మ గుడిపై ఓ దుండగుడు దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అకాస్మాత్తుగా ఆలయం వద్ద ప్రత్యక్ష్యమైన అఘోరీ అక్కడ పూజలు నిర్వహించారు. ఆలయంపై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే కఠినంగా శిక్షించాలని, తాను ధర్మ రక్షణ కోసమే పోరాడుతున్నానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనానికి వెళ్లిన అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలోని ఆమె సొంత గ్రామానికి తరలించారు. ప్రస్తుతం అఘోరీ నాగసాధు ఆమె తల్లిదండ్రుల సంరక్షణలో ఉంది. ఆమెను బయటకు రానివ్వొద్దని పోలీసులు ఆదేశించారు. అలాగే వారి ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ఊరిలోకి ఎవరిని అనుమతించడం లేదు.