Site icon

మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి అరెస్ట్

కొడంగ‌ల్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగ‌ల్‌లో ఫార్మా కంపెనీ భూముల వ‌ద్ద రైతుల తిరుగుబాటు, అధికారుల దాడిలో న‌రేంద‌ర్ రెడ్డి పాత్ర ఉంద‌ని పోలీసులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో నేడు ఉదయం హైదరాబాద్‌ లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద పట్నం నరేందర్‌రెడ్డిని అదుపులో తీసుకున్నారు. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్‌ నేత సురేష్ తో న‌రేంద‌ర్ రెడ్డి పలుసార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్ డేటా ద్వారా మ‌రింత మందిని అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Share
Exit mobile version