Site icon

బ‌ర్త్ డే పార్టీలో డ్ర‌గ్స్!

– ముగ్గురు యువ‌కుల అరెస్ట్
రాష్ట్రంలో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ పెరుగుతూనే ఉంది. ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ క‌ట్టడి కోసం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా వినియోగ‌దారులు, డ్ర‌గ్స్ అమ్మ‌కందారులు దొడ్డి దారిన పోలీసుల క‌ళ్లు గ‌ప్పి వినియోగిస్తూనే ఉన్నారు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో డ్ర‌గ్స్ దొర‌క‌డం క‌ల‌క‌లం రేపింది. జిల్లాలోని రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భూపాలపట్నంలో ఓ బ‌ర్త్ డే పార్టీ జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ల‌భ్య‌మ‌య్యాయి.ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద‌ కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకుంటున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మ‌త్తులో ఉన్న యువకులను రాజానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్రగ్స్ సేవించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యువ‌కుల‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవ‌రు స‌ప్లై చేస్తున్నార‌నే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share
Exit mobile version