ఆంధ్రప్రదేశ్‌లో తుపాకీతో తిరుగుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో ముగ్గురు యువకులు తుపాకీ వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏలూరు టూటౌన్ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో వారిని వివరాలు అడిగారు. యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో కారులో గాలించగా తుపాకీ దొరికింది. ముగ్గురిని కారు సహా స్టేషన్‌కు తరలించారు. తుపాకీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకు వెంట పెట్టుకొని తిరుగుతున్నారనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. ఈ తుపాకీతో యువకులు ఏం చేద్దాం అనుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.