సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను చంపాలని చూశాడంటూ పాల్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటూ ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని పాల్ పేర్కొన్నారు. దాని గురించి ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారని, తాను ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తనను చంపాలని కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నించాడని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.