ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతు ఇచ్చి తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పని చేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను… అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రధాని పోస్టు తెలుగులో పెట్టడంతో నెటిజన్లు ఈ పోస్టు చదవడానికి ఆసక్తి కనబరిచారు. కాగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్క కొమరయ్య, అంజిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.