ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన నూతన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం వైజాగ్ లోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడెకరాల స్థలంలో భూమి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమాలను తన తల్లిదండ్రులతో కలిసి పూర్తి చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అత్యంత వేగంగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.