Site icon

ఇందిరా గాంధీకి ఘ‌న నివాళులు

భార‌త‌ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు ఘన నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప‌లువురు ప్ర‌ముఖ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఢిల్లీలోని శక్తి స్థల్ వ‌ద్ద‌ ఉన్న ఇందిరా గాంధీ సమాధి ద‌గ్గ‌ర పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఎక్స్ వేదిక‌గా తన నానమ్మ ఇందిరా గాంధీతో దిగిన ఒక ప్ర‌త్యేక‌మైన ఫోటోను షేర్ చేశారు. నాన‌మ్మ‌ ధైర్యం, ప్రేమ రెండింటికీ ఉదాహరణ అని రాహుల్ త‌న పోస్టులో రాసుకొచ్చారు. ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఆమెతో ఉన్న జ్ఞాపకాలే తన బలం అని.. ఎల్లప్పుడూ అవే తనకు మార్గం చూపుతాయంటూ రాసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు.

Share
Exit mobile version