గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై చేసిన అనుచిత పోస్టులకు గానూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు కూడా పంపించారు. దీనిపై రాంగోపాల్ వర్మ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన నోటీసులు అందుకున్న ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు. తాజాగా తాను కేసు విచారణకు రాలేంటూ పోలీసులకు ఆర్జీవీ సమాచారం అందించారు. ఈ మేరకు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు గడువు కోరినట్లు సమాచారం.