తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లకు భారీగా నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.1,377.66 కోట్లు మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. 1323.86 కిలో మీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా రోడ్ల నిర్మాణానికి పట్టుబట్టి నిధులు సాధించామని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ప్రత్యేక జాబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఇకపై దివ్యాంగులు ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా జాబ్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే సరిపోతుందని, వారి అర్హతను బట్టి ఉద్యోగం కేటాయిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు.