– టికెట్ రేట్లు 25 శాతం పెంపు
దసరా, బతుకమ్మలకు ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం అంటూనే ప్రయాణికుల నెత్తి మీద చార్జీల బండ మోపింది. రాష్ట్రంలో అతి పెద్ద పండగ అయిన దసరాకు నగరం నుంచి భారీ ఎత్తున ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ 6,300 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ బస్సుల్లో 25 శాతం చార్జీలు పెంచింది. అలాగే ఈ బస్సులు ఈ నెల 14 వరకు నడవనున్నట్లు ప్రకటించింది. కాగా, చార్జీల పెంపుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళలు ఆధార్ కార్డు చూపించి ఆర్టినరీ, సాధారణ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ వెల్లడించింది.