ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3.2 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నెలకు రూ.120 కోట్ల చొప్పున అనర్హులు పెన్షన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ లెక్కన ఏడాదికి రూ.1440 కోట్లు, ఐదేళ్లకు రూ.7200 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ రూ.7 వేల కోట్లు మిగిలితే తాండవ రిజర్వాయర్ లాంటివి మూడు రిజర్వాయర్లు కట్టొచ్చని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచిన విషయం తెలిసిందే. కాగా, దొంగ పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారి వద్ద నుంచి ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్లు రికవరీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, పెన్షన్లు అందరికీ ఇవ్వలేకే ఇలాంటి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.