టాలీవుడ్‌లో మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ చేపట్టింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టి పిటిషన్ ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.