ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బాంబుల మోతతో దద్దరిల్లింది. జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గల బజ్జి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో భారీగా అదనపు బలగాలు మోహరిస్తున్నాయి. సమీపంలో మరింత మంది మావోలు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.