Site icon

ఏపీ,తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గారా!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ విడుదల చేసింది.రెండు రాష్ట్రాల్లో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ చేప‌డ‌తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేసి ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్ఆన‌రు. ఏపీలో గోదావ‌రి జిల్లాల‌తో పాటు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక తెలంగాణ‌లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న జిల్లాల్లో నేటి నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Share
Exit mobile version