తెలంగాణలో ఒంటి పూట బడులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పని చేస్తాయని పేర్కొంది. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు.