Site icon

తెలంగాణ‌లో పుష్ప రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్

అల్లు అర్జున్ తాజా మూవీ పుష్ప‌-2 విడుద‌ల‌కు హైకోర్టులో లైన్ క్లియర్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల అనుమ‌తితో మేక‌ర్స్ టికెట్ల రేట్లు పెంచుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో సైతం మేక‌ర్స్ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్లు పెంచుకుంటామ‌ని కోర‌గా అనుమ‌తి ల‌భించింది. టికెట్ల రేట్ల పెంపుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ జర్నలిస్టు సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. బెనిఫిట్ షోల‌ పేరుతో రూ.800 వ‌ర‌కు వసూలు చేయడం అన్యాయమని ఆయ‌న వాదించారు. దీనిపై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. చివరి నిమిషంలో సినిమా విడుద‌ల‌ను ఆపలేమన్న కోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Share
Exit mobile version