కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. నందవరం మండలం ధర్మాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ బాలికకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను వీర నాగమ్మ, గౌరమ్మ, బేబీలుగా గుర్తించారు. గాయపడిన బాలికను రజియాగా గుర్తించారు. కాగా, కారు అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనాలు ఒకదానికొకటి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రోడ్డు పక్కన చెట్ల కంపల్లోకి వెళ్లిపడ్డాయి.