Site icon

తిరుమ‌ల వెంక‌న్న‌కు రికార్డు స్థాయిలో ఆదాయం!

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి నిత్యం ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌స్తుంటారు. న‌గ‌దు, వ‌స్తు రూపంలో త‌మ మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈ క్రమంలో న‌వంబ‌ర్ నెల‌లో ఆల‌యానికి రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చింది. న‌వంబ‌రు నెల‌లో రూ.111 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. దీంతో వరుసగా 33వ నెల తిరుమ‌ల ఆల‌యం రూ.100 కోట్ల మార్క్ ను దాటింది. గ‌త‌ 11 నెలల కాలంలో హుండీ ద్వారా రూ.1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక డిసెంబ‌ర్ నెల కూడా క‌లుపితే ఈ ఏడాది రూ.1300 కోట్లు దాటుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Share
Exit mobile version