ఇటీవలి కాలంలో పలు చోట్ల అమ్మాయిల కాలేజీ బాత్రూముల్లో సీసీ కెమెరాలు బయటపడటం తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ టాయిలెట్లలో కెమెరా ప్రత్యక్షమైంది. గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్‌లో కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ కోసం పెట్టారు. ఇది గమనించిన విద్యార్థినులు కళాశాలలో ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు విషయం తెలుసుకొని కళాశాలకు చేరుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.
గర్ల్స్ కాలేజీ బాత్రూముల్లో కెమెరా కలకలం
