నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఏపీకి కేటాయించిన నిధులపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్రం కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు ప్రభావం ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి తెలుపుతున్నారని చెప్పారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఏపీ సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన ఏడు నెలల్లో అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులు వచ్చినట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.16 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. పోలవరం కోసం రూ.12 వేల కోట్లు ఇవ్వనున్నారని పేర్కొన్నారు.ఏపీలో జల్ జీవన్ మిషన్ ను ఏపీలో పొడిగించాలని కోరగా 2028 వరకు పొడిగించారని తెలిపారు. ఉడాన్ పథకాన్ని పదేళ్లు పొడిగించినందుకు గానూ ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.