వినేశ్ ఫోగాట్ ఘ‌న విజ‌యం 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ స్టార్‌ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ త‌ర‌ఫున‌ జులానా అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలో నిలిచిన ఆమె 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ నేత‌ యోగేష్ బైరాగి రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వినేష్ ఫొగట్ సంబరాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు దండాలు వేసి.. బాణాసంచా కాల్చుతున్నారు.కాగా, మొదటి రెండు రౌండ్లలో వినేష్ ఫొగట్ ఆధిక్యంలో ఉన్నారు. కానీ త‌ర్వాత వ‌రుస‌ల రౌండ్ల‌లో బీజేపీ లీడ్‌లోకి వ‌చ్చింది. దీంతో వినేష్ ఫోగాట్ నిరాశ‌తో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి వినేష్ అనూహ్యంగా లీడింగ్‌లోకి రాగా, ఏడో రౌండ్‌లో స్వ‌ల్ప లీడ్ మాత్ర‌మే ద‌క్కింది. ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి వినేష్ ఫోగట్ రెండు వేల లీడింగ్‌లోకి దూసుకెళ్లారు. తొమ్మ‌దో రౌండ్‌కు ఆధిక్యం రెట్టింపైంది. ప‌ద‌కొండో రౌండ్ కు ఆరు వేలు దాట‌గా, ప‌ద్నాలుగో రౌండ్ ముగిసేసరికి ఐదు వేలకు పైగా లీడింగ్‌తో ఘ‌న విజ‌యం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. కాగా, వినేష్ మొట్ట‌మొద‌టిసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగి విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *