Site icon

వైసీపీ మ‌రో బిగ్ షాక్ !

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి ఆ పార్టీ నేత‌లు వ‌రుస రాజీనామాల‌తో షాక్ ఇస్తున్నారు. ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలా మంది పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు తాజాగా మ‌రో కీల‌క నేత పార్టీకి వీడ్కోలు ప‌లికారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆనంద్‌తో పాటు మ‌రో 12 మంది విశాఖ డెయిరీ డైరెక్ట‌ర్లు పార్టీ ప్రాథ‌మిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త‌మ‌ రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌కు పంపించారు. అయితే వారు టీడీపీలో చేర‌తారా లేదా జ‌న‌సేనలో చేర‌తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

Share
Exit mobile version