అల్లు అర్జున్ రాక‌తో తొక్కిస‌లాట‌.. మ‌హిళ మృతి

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప మూవీ విడుద‌లైన ఓ థియేట‌ర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అల్లు అర్జున్ రాక‌తో భారీగా అభిమానులు రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగి ఓ మ‌హిళ ప్రాణాలు కోల్పోయింది. హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బుధవారం రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. సంధ్య థియేట‌ర్‌లో సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ కుటుంబంతో క‌లిసి వ‌చ్చారు. బ‌న్నీని చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. దీంతో తొక్కిసలాట జ‌ర‌గ‌గా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.ఈ క్ర‌మంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కింద పడిపోయారు. జ‌నాలు వాళ్ల‌ను తొక్కుకుంటూనే ప‌రుగులు పెట్టారు. దీంతో వారిద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. తల్లీకొడుకులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేసి ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రేవ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. శ్రీతేజ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్​ కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *