బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహించారు. కిషన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా
మహిళలు , యువత, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.