ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలు విషయాలకు సంబంధించి అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. అక్టోబర్ 24న ఓ పెద్ద విషయాన్ని బయటపెట్టబోతున్నట్లు వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.ప్రిపేర్ ఫర్ ది బిగ్ రివీల్.. అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు స్టే ట్యూన్‌డ్ ఫర్ ఎక్సోప్లోరల్ ట్రుత్ అంటూ పోస్టు చేశారు. ఇంతకీ విషయం ఏమై ఉంటుందా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి సైతం ఓ పోస్టు ఇలాంటిదే బయటకు వచ్చింది. బిగ్ ఎక్స్ పోస్ కమింగ్ ఆన్ అక్టోబర్ 24 అంటూ పోస్టు వదిలారు. ఇంతకీ ఇరు పార్టీలు ఏం బయటపెడుతున్నాయో అంటూ జనం చర్చించుకుంటున్నారు.