భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఓ యువతి జీవితం మున్నాళ్ల ముచ్చటగా మారింది. పెళ్లి అయిన నెల రోజులకే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. విజయ గౌరి(20)కి ఇటీవల వివాహం జరిగింది. హైదరాబాద్ బాలానగర్‌లో భర్తతో కలిసి ఉంటోంది. శనివారం ఉదయం విజయాగౌరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయగౌరీ ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. యువతి ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.