Site icon

ఏపీలో క‌రెంటు చార్జీల పెంపుపై జ‌గ‌న్ కౌంట‌ర్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం క‌రెంటు చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యంత‌పై మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ప‌లు స‌మావేశాల్లో ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వైయ‌స్ జ‌గ‌న్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. సీఎం చంద్ర‌బాబు నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడిన ఓ వీడియోను పోస్టు చేశారు. స‌ద‌రు వీడియోలో చంద్ర‌బాబు రాబోయే ఐదు సంవత్స‌రాల్లో క‌రెంటు చార్జీలు పెంచ‌ను అంటూ ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తున్నారు. దీనిపై జ‌గ‌న్ స్పందిస్తూ ఎన్నిక‌ల్లో మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేస్తున్నా అంటూ సీఎం చంద్ర‌బాబు అకౌంట్ ను ట్యాగ్ చేశారు. మ‌రోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయ‌స్ ష‌ర్మిల సైతం క‌రెంటు చార్జీల పెంపుపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

Share
Exit mobile version